పరువులేని నాగార్జున పరువు నష్టం దావా వేయడమా?: సీపీఐ నారాయణ మరోసారి ఫైర్
హీరో పరువులేని నాగార్జున పరువు నష్టం వేయడమేంటని సీపీఐ నారాయణ మరోసారి ఫైర్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: పరువులేని నాగార్జున పరువు నష్టం వేయడమా అంటూ సీపీఐ నారాయణ(CPI Narayana) మరోసారి ఫైర్ చేశారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై నాగార్జున పరువు నష్టం వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పరువులేని నాగార్జున పరువు నష్టం వేయడమేంటని, హాస్యాస్పదంగా ఉందని సెటైర్లు వేశారు. బిగ్ బాస్(Big Boss) ద్వారా నాగార్జున చాలా పరువుపోగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నటి సమంత(Actress Samantha) లాంటివాళ్లు పరువు నష్టం వేస్తే ఓ అర్థం ఉంటుందన్నారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నాగార్జున కోర్టుకు వెళ్లడం సరికాదని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR)పై విమర్శలు చేసే క్రమంలో సమంత, నాగ చైతన్య(Naga Chaitanya) విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హీరో నాగార్జున(Hero Nagarjuna) సీరియస్ అయ్యారు. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబం పరువుకు కొండా సురేఖ భంగం కలిగించారని రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ దావాపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు.