AP News:కాంగ్రెస్‌కు "గుడ్ బై"..ఆ పార్టీలో చేరిన సీనియర్ నేత

తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును ప్రజల మన్ననలను సంపాదించుకున్నారు.

Update: 2024-05-05 12:24 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును ప్రజల మన్ననలను సంపాదించుకున్నారు. టీటీడీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై, భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలపై శ్రీవారి భక్తునిగా, స్థానికునిగా నిరంతరం ప్రశ్నిస్తూ శ్రీవారి నిధులను సంరక్షిస్తూ అలాగే తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ మరియు ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శివప్రకాష్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి నవీన్ బీజేపీ కుటుంబ సభ్యుడిగా రావడం చాలా సంతోషదాయకం అన్నారు.వీరితోపాటు రాష్ట్ర సంఘటిత మంత్రి మధుకర్ జి, మోహన్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ MP, సిద్దరాజు పార్లమెంట్ ఇన్చార్జి,అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ రాష్ట్ర బీజేపీ నాయకులు కోలా ఆనంద్, భాను ప్రకాష్ రెడ్డి,నాగోతు రమేష్ నాయుడు తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తూ వెంకన్న సంపదను సంరక్షిస్తూ నిరంతరం శ్రీవారికి సేవ చేస్తున్న నవీన్ బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు.

Read More..

వెన్నుపోటుకు బలి కానున్న షర్మిల..పులివెందులలో ఆమెకు చెక్ పెట్టెదవరూ? 

Tags:    

Similar News