Viral : దువ్వెనతో దువ్వితో బంగారం బయటపడుతుంది.. స్త్రీ, పురుషులు అదే పనిగా దువ్వుతున్నారు.. ఎక్కడో తెలుసా?
ఈ మధ్య కాలంలో నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంచం కొత్తగా కనిపిస్తే చాలు.. నిముషాల్లోనే వైరల్ అవుతుంది. తాజాగా, మత్స్యకారులు దువ్వెన పట్టుకొని ఇసుక మీద దువ్వుతూ ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. అసలు, వారెందుకు అలా చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
అలలు ఒడ్డుకు వచ్చి లోపలకు వెళ్ళినప్పుడు ఇసుకపై దువ్వెనతో గీస్తున్నారు. ఇలా గీసిన తర్వాత ఇసుక లోపల నుంచి చిన్నచిన్న బంగారు రేణువులు బయట పడ్డాయి. మళ్ళీ సముద్రంలో ఇంకో కెరటం ఒడ్డుకు వచ్చే సరికి ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి వేస్తున్నారు. ఇలా, చాలా మందికి రోజుకు ఎంతో కొంత బంగారం దొరుకుతుంది.
కొందరైతే అదే పనిగా, ఉదయం నుంచీ సాయంత్రం వరకు ఒక్కొక్కొరు రూ. 500ల నుంచి 800 రూపాయల విలువైన బంగారు రజను సేకరిస్తామని మత్స్యకారులు చెబుతున్నారు. పూర్వకాలంలో అక్కడ పెద్ద నగరం ఉండేదని, అది సముద్రగర్భంలో కలిసిపోయిందని అంటున్నారు. సముద్రపు కెరటాలు ఎగిసిపడినప్పుడు ఆ బంగారపు ముక్కలు ఒడ్డుకు చేరుతున్నాయని ఆ కథను చెబుతున్నారు. ఈ బంగారం కోసం కాకినాడ, కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు వెతుకుతున్నారు.