Gaint Wheel Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం.. జెయింట్ వీల్ మీది నుంచి పడి మహిళ మృతి
తిరుపతి శిల్పారామం(Tirupati Shilparamam)లో ఘోర ప్రమాదం జరిగింది.
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి శిల్పారామం(Tirupati Shilparamam)లో ఘోర ప్రమాదం జరిగింది. తిరుచానూరు(Tiruchanur)లోని శిల్పారామంలో ఫన్ రైడ్ కాస్త ట్రాజెడీ రైడ్ గా ముగిసింది. సాయంత్రం పూట ఆనందంగా గడుపుదామని శిల్పారామంకు వచ్చిన కుటుంబంలో తీరని దుఃఖం మిగిలింది. ఫన్ రైడ్‌లో భాగంగా జెయింట్ వీల్(Gaint Wheel)లో తిరుగుతున్న ఇద్దరు మహిళలు 20 అడుగుల ఎత్తునుండి కిందపడిపోయారు. జెయింట్ వీల్ లో కూర్చున్న క్యాబిన్లో సేఫ్టీ బెల్ట్ తెగిపోవడంతో వారు ఇద్దరూ కిందపడగా.. అందులొనీడదరు కిందపడిపోయారు. వారిలో లోకేశ్వరి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా.. మరొక మహిళ తీవ్ర గాయాలపాలైంది. గాయలైన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్వహకులపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే శిల్పారామాన్ని మూసి వేశారు.