నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఆత్మహత్యాయత్నం వార్తలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు స్పందించారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆత్మహత్యాయత్నం చేశారని, నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని తెలిపారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యానని అదీప్ రాజు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ అయిందనుకొని ఆస్పత్రికి వెళ్లామని, అయితే అది గ్యాస్ట్రిక్ సమస్య కావడంతో చికిత్స అందించి ఆ తర్వాత వైద్యులు డిశ్చార్జి చేశారని తెలిపారు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి అవసరం లేదన్నారు. ఈ మేరకు అదీప్ రాజు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.