‘చంద్రబాబు నిర్దోశిగా బయటకు వస్తారు.. మాకు ఆ నమ్మకం ఉంది’

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మౌన దీక్ష చేపట్టారు. గాంధీ సమాధి వద్ద ఎంపీలు, మాజీ ఎంపీలతో లోకేష్ నివాళుల్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

Update: 2023-09-19 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మౌన దీక్ష చేపట్టారు. గాంధీ సమాధి వద్ద ఎంపీలు, మాజీ ఎంపీలతో లోకేష్ నివాళుల్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్, ఏపీ రాజకీయ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మీడియాతో మాట్లాడారు.

కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్దోశిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి గాంధీ సమాధి వద్ద నివాళులర్పించే స్థితికి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు.

Read More..

చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ  

Tags:    

Similar News