పవన్ కల్యాణ్‌ను ఒక్క మాట అనడానికి వీళ్లేదు.. సొంత నేతలకు వర్మ రిక్వెస్ట్

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగ భగ్గుమంది. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖరారు కావడంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అనుచరులు ఆందోళన బాట పట్టారు.

Update: 2024-03-14 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగ భగ్గుమంది. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖరారు కావడంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అనుచరులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా సొంత నేతను, స్థానిక వ్యక్తిని కాదని టికెట్ కేటాయించడంతో టీడీపీ జెండాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇంతకాలం పార్టీని నమ్ముకొని ఉన్న వర్మను చంద్రబాబు మోసం చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇండిపెండెంట్‌గా అయినా సరే వర్మ బరిలో ఉండాలని డిమాండ్‌లు చేస్తు్న్నారు. తాజాగా.. ఆందోళన కారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక సందేశం పంపించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. అనవసరంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విమర్శించొద్దని అన్నారు. నా టికెట్ విషయంలో పవన్ కల్యాణ్‌కు సంబంధం లేదని తెలిపారు. ఇది మన పార్టీ విషయమని.. మనమే మాట్లాడుకోవాలని సూచించారు. తాను కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని అన్నారు. ఎవరూ ఆవేశ పడొద్దని కోరారు.

Read More..

పిఠాపురం నుంచి పవన్ పోటీ..టీడీపీ జెండాలు, ప్లెక్సీలు తగలబెట్టిన నేతలు  

Tags:    

Similar News