మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీమంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న సైకిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2023-10-16 05:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీమంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న సైకిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ స్కాం కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కొల్లు రవీంద్ర సైకిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం కొల్లు రవీంద్ర సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొంతదూరం సైకిల్ ర్యాలీగా వెళ్తున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొల్లు రవీంద్ర సైకిల్ ర్యాలీ చేపట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రతిపక్ష నేతలపై వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పోలీసులు పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శాంతియుతంగా సైకిల్ ర్యాలీ చేపడితే అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Tags:    

Similar News