ప్రకాశం బ్యారేజీ బోట్ల ఢీ కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ స్ట్రాంగ్ రియాక్షన్
ప్రకాశం బ్యారేజీ బోట్ల ఢీ ఘటనలో వైసీపీ నేతలపై నెపం వేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన విషయం తెలిసింది. అయితే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులు రామ్మోహన్, ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారన్నారు. చంద్రబాబు చేతిలోనే ప్రభుత్వం ఉందని, ఘటనపై విచారణ చేయించలేరా అని నిలదీశారు. వైసీపీ నేతలతో రామ్మోహన్ అనే వ్యక్తి ఫొటోలు దిగితే బోట్ల నెపం తమపై నెడతారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై చెప్పండని బోటు ఓనర్లపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. వరదలపై పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. కుట్రలో భాగంగానే వైసీపీ నేతలపై నెపం మోపుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.