Ongole: నోటీసులపై స్పందించిన చెవిరెడ్డి

మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు...

Update: 2025-03-12 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు(Ongole)లో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్న ఆయనకు పోలీసులు 41-ఏ నోటీసులు అందజేశారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఈ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేసులు పెట్టి వైసీపీ నేతలను అణచివేయాలని టీడీపీ(Tdp) నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ పాలించిన సమయంలోనూ తనపై 88 కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా 5 కేసులు నమోదు చేశారని చెప్పారు. ఉద్యమాలు, పోరాటాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పుట్టిందని, కేసులకు భయపడమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, చేస్తూనే ఉంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News