బైక్‌ను ఢీ కొన్న లారీ.. దంపతులు స్పాట్ డెడ్

వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2025-03-14 13:27 GMT
బైక్‌ను ఢీ కొన్న లారీ.. దంపతులు స్పాట్ డెడ్
  • whatsapp icon

దిశ, కడప: వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మైదుకూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరుకు చెందిన చలమయ్య(60) లక్ష్మీ దేవి(56) దంపతులు తమ కుమారుడితో కలిసి టి. వి.ఎస్ మోటార్ సైకిల్ పై కేశలింగాయపల్లి గ్రామంలో పొలం పనులు చూసుకుని మైదుకూరుకు వెళ్లేందుకు మోటారు సైకిల్ ఎక్కుతుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలు చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Similar News