నీ భర్తను ఏడాదిలోపు చంపేస్తాం.. దస్తగిరి భార్యకు బెదిరింపులు

తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య షాబానా ఫిర్యాదు చేశారు....

Update: 2025-03-16 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని ఇద్దరు మహిళలు బెదిరించినట్లు పులివెందుల నియోజకవర్గం తొండూరు పోలీసులకు దస్తగిరి భార్య షాబానా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య(Former Minister Vivekananda Reddy Murdered) కేసులో దస్తగిరి(Dastagiri) అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తనను ఇద్దరు వైసీపీ(YCP) మహిళా కార్యకర్తలు బెదిరించారని దస్తగిరి భార్య షాబానా(Dastagiri wife Shabana) ఆరోపించారు. తొండూరు మండలం మల్యాలలో బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో తనతో ఉద్దేశపూర్వంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు విషయం తెలుసుకుని తన వద్దకు వచ్చిన భర్త దస్తగిరిని సైతం ఇద్దరు మహిళలు బెదిరించారని షాబానా చెప్పారు. వివేకానందారెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులను ఇరికించే విధంగా సీబీఐకి సాక్ష్యం చెబితే దస్తగిరిని ఏడాదిలోపే నరికేస్తామని ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు బెదిరించినట్లు ఫిర్యాదులో షాబానా పేర్కొన్నారు. తమపై దాడి చేసి వారితో పాటు ప్రేరేపించిన నాయకులను అరెస్ట్ చేయాలని షాబానా కోరారు. షాబానా ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News