ఏడు సెకన్లలోనే గుండె పరీక్షలు..సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏపీ బాలుడు

ఏపీకి చెందిన బాలుడు గుండె జబ్జు నిర్దారణకు అద్భుతమైన స్క్రీనింగ్ పరీక్షను కొనుగొన్నారు.

Update: 2025-03-14 13:01 GMT
ఏడు సెకన్లలోనే గుండె పరీక్షలు..సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏపీ బాలుడు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అకస్మాత్తుగా పలువురికి గుండె పోటు రావడం, వెంటనే చనిపోవడవం వంటివి చాలా చూస్తున్నాం. నడుస్తూనో, ఆడుకుంటునో, ఫంక్షన్‌లో ఉన్నప్పుడో పెద్దల నుంచి చిన్నారులు వరకూ కుప్పకూలిపోయి మృతి చెందుతున్నారు. ఇందుకు కారణం గుండెపోటు(Heart Attack) అని నిర్ధారణ అవుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు గుండె పరీక్షలు చేయించుకునేందుకు రోగులు తిప్పలు పడుతున్నారు. టెస్టుల కోసం వేల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడి టెస్టులు చేయించుకుంటున్నారు. రిపోర్టుల కోసం రోజుల తరబడి వేయిట్ చేస్తున్నారు. ఇలా గుండె జబ్జులు నిర్ధారణ కావడానికి సమయం పడుతోంది.

అయితే ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఏపీకి చెందిన 14 ఏళ్ల బాలుడు అద్భుతమైన స్క్రీనింగ్ పరీక్షను కొనుగొన్నారు. అది కూడా స్మార్ట్ ఫోన్(Smart phone) ద్వారా. ఏఐ టెక్నాలజీ(AI technology)తో ‘సిర్కాడియావీ అనే యాప్’ CircadiaV App) ద్వారా పరీక్షలు చేయడం అందరిని ఆకర్షిస్తోంది. స్మాట్ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లే పాటు ఉంచితే ఈ యాప్ గుండె స్పందననను రికార్డు చేస్తుంది. రోగికి గుండె జబ్బు ఉంటే బీప్ సౌండ్‌తో రెడ్ లైట్ కలిగి గ్రాఫిక్స్‌లో ‘‘ అబ్ నార్మల్ హార్ట్ బీట్’’ అనే పదాలు స్ర్కీన్‌పై కనిపిస్తుంది. ఇలా గుండె జబ్జులను ఈజీగా గుర్తిస్తున్నారు.

గత రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి(Guntur GGH Hospital)లో గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 500 మందికి పరీక్షలు చేస్తే 10 మందికి గుండె జబ్బులు నిర్దారణ అయింది. అయితే వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేస్తే గుండె జబ్బు నిర్దారణ అయింది.

ఎవరీ బాలుడు


అనంతపురం జిల్లా(Anantapur District)కి చెందిన మహేశ్ కుటుంబం 2010లో అమెరికా(America) వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. మహేశ్ కుమారుడే సిద్ధార్థ్(Siddharth). ఈ 14 ఏళ్ల బాలుడు డల్లాస్‌(Dallas)లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఏఐ బేస్ట్ కంప్యూటర్ సైన్స్(Bachelor of AI Best Computer Science) చదివారు. ‘సిర్కాడియావీ’ అనే యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా 15 వేల మందికి అమెరికాలో స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 3500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు 93 శాతం నిర్ధారణ అయింది. గుంటూరు ఎంపీ పెమ్మసానిని సిద్ధార్ద్ ఇటీవల అమెరికాలో కలిశారు. ఈ యాప్ ఫలితాలను వివరించారు. దీంతో గుంటూరు జీజీహెచ్‌లో సిద్ధార్థ్ పరీక్షలు నిర్వహించారు. 

Tags:    

Similar News