ఆ సినిమా వల్లే గద్దరన్న పరిచయం అయ్యారు : పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఖుషీ’ సినిమా వల్ల గద్దరన్న పరిచయం అయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ‘ఖుషి’ సినిమా(Kushi Movie) వల్ల గద్దరన్న పరిచయం అయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. జనసేన(Janasena) పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల ద్వారా గద్దర్ తనకు పరిచయం కాలేదని తెలిపారు. ‘‘ఖుషి సినిమా చూసి మా అన్నయ్యకు దగ్గరకు వచ్చారు. మీ తమ్ముడిని కలవాల్సిందే అని చెప్పారు. నాకు మా అన్నయ్య చిరంజీవి ఫోన్ చేశారు. ఆ తర్వాత గద్దర్ కలిశారు. దేశం, సమాజం కోసం పని చేస్తున్నావు. ‘ఏ మేరా జహా’.. పాటలో థీమ్ నాకు నచ్చిందని అని గద్దర్ చెప్పారు. భరత మాతకు సంకెళ్లలో బంధించి పెట్టావు అని అన్నారు. నీ భావం నాకు అర్ధమైంది అని గద్దర్(Gaddar) చెప్పారు. నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని గద్దర్ అన్న అన్నారు. అలా గద్దర్‌తో అన్నాతమ్ముడు బంధం అయింది. గద్దర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం.’’ పవన్ కల్యాణ్ తెలిపారు.
READ MORE ...
చాలెంజ్ చేసిన ఆ తొడలను బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు