పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎవరైనా గెలిపించారంటే వారి కర్మ అని ఆ పార్టీ నేత నాగబాబుసంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం(Pithapuram)లో జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఎవరైనా తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మ అని ఆ పార్టీ నేత నాగబాబు(Nagababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో రెండు నిజాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్ కల్యాణ్ అయితే రెండోది పిఠాపురం జనసైనికులు, ఓటర్లు అని వ్యాఖ్యానించారు. అలా కాదని పవన్ కల్యాణ్ గెలుపునకు తామే కారణమని తమలో ఎవరైనా అనుకుంటే చేయగలిగినది ఏమీ లేదని నాగబాబు చెప్పారు.
మరో నాలుగేళ్లలో అధికారంలోకి వస్తామన్న జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి నాగబాబు విమర్శలు కురిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని, మరో నాలుగేళ్లు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వస్తాయని, అప్పుడు తామే అధికారంలోకి వస్తామంటున్న జగన్‌కు నాగబాబు కీలక సలహా ఇచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్(YSRCP chief YS Jagan) మళ్లీ అధికారంలోకి రావడమేనది హాస్యమని ఎద్దేవా చేశారు. ‘‘మీరు నిద్రలోనే ఉండండి.. అప్పుడప్పుడు కలవరించండి. 20, 30 ఏళ్ల తర్వాత కలలో నుంచి బయటకు రండి. 20 ఏళ్ల తర్వాత మేల్కోండి.. ఆ తర్వాత మీ ఇష్టం.’’ అని నాగబాబు తెలిపారు.