బ్రేకింగ్ న్యూస్.. మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్
నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి సుబ్బారెడ్డి, అఖిల ప్రియా వర్గీయులు పరస్పరం దాడి చేసుకోగా.. ఎవీ సుబ్బారెడ్డీకి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో నంద్యాల స్టేషన్‌లో సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు భార్గవ రామ్, పీఏ మోహన్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ దాడిలో మాజీ మంత్రి అఖిల ప్రియ హస్తం ఉందని.. ఈ రోజు తెల్లవారుజామున ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి నంద్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నంద్యాల ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read..