అప్పుల విషయంలో ప్రభుత్వం బాగా నటిస్తోంది: మాజీ మంత్రి బుగ్గన
ఉద్యోగుల సొమ్ము ఇతర అవసరాలకు వినియోగించారని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు..
దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగుల సొమ్ము ఇతర అవసరాలకు వినియోగించారని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Former Finance Minister Buggana Rajendranath Reddy) అన్నారు. అప్పుల లెక్క విషయంలో గత ప్రభుత్వంపై టీడీపీ(Tdp) నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. టీడీపీ హయాంలో పబ్లిక్ అకౌంట్‌లోని రూ.57,378 కోట్లు ఇతర పర్పస్‌లకు వాడారని, వైయస్ఆర్‌సీపీ(Ysrcp) హయాంలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించిన పబ్లిక్ అకౌంట్ నిధులు రూ.655 కోట్లు మాత్రమేనని బుగ్గన వెల్లడించారు.
గ్యారెంటీలు, కార్పొరేషన్ అప్పుల విషయంలోనూ టీడీపీ దుష్ప్రచారమే చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏటా అప్పుల వృద్ధి రేటు 22.63% ఉందని, అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటా అప్పుల వృద్ధిరేటు 13.57% మాత్రమేనని స్పష్టం చేశారు. వైయస్ జగన్(Ys Jagan) ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అకౌంట్లో ఉందని, ఎవరికి ఇచ్చామో బ్యాంక్ రికార్డ్స్‌లో ఉందిన్నారు. ఇక ఇందులో స్కామ్‌కు అవకాశమే లేదన్నారు. అప్పుల లెక్కల విషయంలో కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. బ్యాంక్ అప్పు, ప్రభుత్వం ఇవ్వాల్సింది రెండు అప్పులు డబుల్ ఎంట్రీ చేసి లెక్కలు ఎక్కువ చెబుతున్నారని మండిపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఓపెన్ మార్కెట్ బారోయింగ్‌లో కూడా ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చామని బుగ్గన పేర్కొన్నారు.