ఢిల్లీలో మాజీ సీఎం నిరసన.. మద్దతు తెలిపిన ఇండియా కూటమి పార్టీలు

ఈ రోజు మాజీ సీఎం జగన్ ఢిల్లీలో 24 గంటల నిరసన కార్యక్రమం చేపట్టారు.

Update: 2024-07-24 10:01 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక దాడులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని.. వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇండ్లపై దాడులు చేస్తున్నారని.. ఆరోపిస్తూ.. ఈ రోజు మాజీ సీఎం జగన్ ఢిల్లీలో 24 గంటల నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఢిల్లీలో నిరసనకు దిగిన వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు లభించింది. ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివసేన కు చెందిన ఎంపీ జగన్ కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీల అధికారం మారుతూనే ఉంటుంది. కానీ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కక్షసాదింపు చర్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన జగన్ ధర్నాకు మొత్తం 8 రాజకీయ ా పార్టీలు మద్దతుగా నిలిచాయి. 

Read More..

AP News:అక్రమాల్లో టాప్..వెలుగు చూస్తున్న పిన్నెల్లి సరికొత్త అక్రమాలు? 

Tags:    

Similar News