Breaking: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఐదుగురికి రిమాండ్

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు...

Update: 2024-08-05 13:26 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులు రాంబాబు, ఇమ్రాన్, సయ్యద్ సిద్దిక్, అమరేంద్ర రెడ్డి, షేక్ ఇర్ఫాన్‌కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితులను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైసీపీ నాయకుల ఒత్తిడితో విచారణలో అలసత్వం వహించినట్లు అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే ఈ కేసు విచారణలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఆ పార్టీ నేత దేవినాని అవినాశ్ అనుచరులు ఉన్నట్లు తెలింది. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మిగిలిన నిందితులను గుర్తించి జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News