దుకాణంలో అగ్ని ప్రమాదం

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఏ.రంగంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2023-04-05 04:33 GMT

దిశ, తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఏ.రంగంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుకాణం లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడి కాలింది. ప్రమాదవశాత్తు చిల్లర దుకాణంలో ఉన్న పెట్రోల్, డీజిల్, వంట నూనె అంటుకుని మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకున్న వృద్దురాలు మునిరాజమ్మ. అనంతరం జెసిబితో గోడలు పగులగొట్టి మునిరాజమ్మను గ్రామస్తులు బయటకు తీశారు.పరిస్థితి విషమం గా ఉంది. మెరుగైన వైద్యం కోసం ఆమెనుఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News