రైతులంటే జగన్‌కు చిన్నచూపు.. పాదయాత్రలో నారా లోకేశ్ ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది.

Update: 2023-01-30 08:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. ఉదయం చెల్దిగానిపల్లి క్యాంపు నుంచి ప్రారంభమైంది. అనంతరం పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇకపోతే కర్ణాటక రాష్ట్రం పంతాన్ హల్లి చేరుకున్న లోకేశ్ పాదయాత్ర చేరుకుంది. లోకేశ్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పంతాన్ హల్లి హెచ్ పెట్రోల్ బంక్‌లో లోకేశ్ కాన్వాయ్‌లోని వాహనాలకు దగ్గరుండి డీజిల్ కొట్టించారు. అనంతరం తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి తేడా తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై జగన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ లోకేశ్ కార్యకర్తలకు వివరించారు. కర్ణాటకలో డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102గా ఉంటే ఏపీలో డీజిల్ 99.27, పెట్రోల్ 111.50 రూపాయిలు అని ఆరోపించారు. అంటే జగన్ రెడ్డి బాదుడు 10 రూపాయిలు అని చెప్పుకొచ్చారు. తనతో నడుస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు రేట్ల తేడా గురించి వివరించి దేశంలోనే ఏపీలో ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటూ పన్నుల భారం గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వివరించారు.


వైసీపీకి రైతులు గుణపాఠం చెప్పాలి

వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీలు రావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దాణా, సైలేజ్‌ ఇవ్వడం లేదని.. పాలు లీటరుకు రూ.4 బోనస్‌ ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. పడిగల కుప్పం వద్ద రైతులతో లోకేశ్ మాట్లాడారు. పశువులకు జబ్బు చేస్తే ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులంటే వైసీపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని లోకేశ్ ఆరోపించారు. రైతు వ్యతిరేక పాలన చేస్తున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 'అమూల్‌ మీదున్న ప్రేమతో సహకార సంఘాల డెయిరీలను నాశనం చేశారు అని లోకేశ్ ఆరోపించారు. పాడిరైతుల పేరుతో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకుని అమూల్‌కు కట్టబెడుతున్నారు అని లోకేశ్ ధ్వజమెత్తారు.


నేటి పాదయాత్ర సాగేదిలా

ఉదయం 8గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. నియోజకవర్గంలోని వి.కోట మండలం, కెంగుటం పంచాయతీలలో కొనసాగింది. అనంతరం కోరకుంటలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖలతో లోకేశ్ ముఖాముఖి అయ్యారు. అనంతరం పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో లోకేశ్ మాట్లాడారు. అలాగే గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో వారి సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎంఆర్ కల్యాణమండపం చేరుకున్నారు. అక్కడ యువత లోకేశ్‌కు భారీగా ఘన స్వాగతం పలికారు. యువతతో లోకేశ్ భేటీ అయ్యారు. యువతతో భేటీ అనంతరం వి.కోట మండలం పీఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు వి.కోట మండలం ఆఘ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనారిటీలతో లోకేశ్ భేటీ అవుతారు. అనంతరం వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రిపూట లోకేశ్ బస చేయనున్నారు.

READ MORE

TDP Leader Chintakayala Vijay : సీఐడీ విచారణకు చింతకాయల విజయ్ 

Tags:    

Similar News