కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నా: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Update: 2023-10-16 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం వచ్చిందని చెప్పుకొచ్చారు. మూడో సారి ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

Tags:    

Similar News