రేపటి నుంచి ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియ

నవంబరు 6 నుండి ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఏపీఈఏపీ సెట్- 2023 కన్వీనర్,సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.

Update: 2023-11-05 09:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : నవంబరు 6 నుండి ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఏపీఈఏపీ సెట్- 2023 కన్వీనర్,సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ప్రత్యేక రౌండ్ ప్రవేశాలకు ప్రభుత్వ పధకాల వర్తింపు అవుతుందని అన్నారు. తొలి, తుది, స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందలేని వారికి ఇదొక అవకాశం అని చదలవాడ నాగరాణి అన్నారు. నూతనంగా రిజిస్టేషన్ చేసుకునే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం దీనిని నిర్దేశించామని చెప్పుకొచ్చారు. తొలి, మలి దశతో పాటు స్పాట్ అడ్మిషన్లు ఇప్పటికే ముగిశాయని... కేవలం ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్‌ను చేపడుతున్నామని వెల్లడించారు. తొలి, మలి దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్‌కు అర్హత కలిగి ఉంటారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఉంటుదని, కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని నాగరాణి స్పష్టం చేశారు.

నవంబరు 10న సీట్ల కేటాయింపు

ఇకపోతే విద్యార్ధుల నుండి భిన్న రూపాలలో వచ్చిన అభ్యర్ధనల ఫలితంగా సీఎం వైఎస్ జగన్ ఈ ప్రత్యేక కౌన్సిలింగ్‌కు అనుమతి ఇచ్చారని ఏపీఈఏపీ సెట్- 2023 కన్వీనర్,సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మరో వైపు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఈవిషయంలో ప్రత్యేక చొరవ చూపారని నాగరాణి పేర్కొన్నారు. ప్రత్యేక రౌండ్‌లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పధకాలకు అనుమతి ఉందని కన్వీనర్ వివరించారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల లోని బీఈ/బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబరు 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు ఐచ్చికాల నమౌదుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నవంబరు 8న ఆప్షన్ల నమోదు, మార్పుకు అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు. నవంబరు 10న సీట్ల కేటాయింపు జరుగుతుందని...సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 11 నుండి 13 వరకు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉందని ఏపీఈఏపీసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

Tags:    

Similar News