Kolusu Parthasarathy:రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు.. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం(AP Government) ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) అన్నారు.

Update: 2024-12-03 12:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం(AP Government) ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) అన్నారు. ఏపీలో నేడు(మంగళవారం) కేబినెట్ సమావేశం(Cabinet Meeting) అనంతరం ఏపీ మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ క్రూరమైన ఆలోచనలతో ప్రాజెక్టులు నాశనం చేశారని ఫైరయ్యారు. విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. PMAY అర్బన్, గ్రామీణ్, వన్ మన్ లలో పూర్తికాని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఐటీ(IT), గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ(Global Competitive Centers Policy)కి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. యువతీయువకులకు భరోసా కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఏపీ మారిటైం పాలసీ, టెక్స్‌టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపినట్లు వివరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం(AP State Medical Council for Indian System)గా ఆయుర్వేద బోర్డుని మార్చడం జరిగింది. అలాగే ఏపీ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది అని పార్థసారథి పేర్కొన్నారు. పోర్టుల ద్వారా రవాణా 450 మిలియన్ టన్నులు గుజరాత్ చేస్తుంటే.. ఏపీ 180 టన్నులు చేస్తోంది అని వివరించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) మెగా షిప్ యార్డు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో, ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం లేకపోయిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Tags:    

Similar News