పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ఎఫెక్ట్: మరికాసేట్లో చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమరావతి నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు.

Update: 2023-10-06 05:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమరావతి నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి నారా లోకేశ్ అమరావతి చేరుకున్నారు. అయితే శుక్రవారం నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లోకేశ్ అమరావతి నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. లోకేశ్ వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, వైవీబీ రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. వీరంతా కాన్వాయ్‌గా రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరారు. నేరుగా లోకేశ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణిని కలుస్తారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకశ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

ఈ అంశాలే ప్రధాన అజెండా

టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఇటీవలే కన్ఫర్మ్ అయ్యింది. అయితే పొత్తు నచ్చని వాళ్లు అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ సైతం టీడీపీ శ్రేణులకు వార్నింగ్ సైతం ఇచ్చారు. మీకు స్నేహహస్తం అందించాం. మాతో గొడవలు వద్దు అని కూడా పవన్ కల్యాణ్ హితవు పలికారు. భవిష్యత్‌లో ఇవి ఇబ్బందికర పరిస్థితితులకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇప్పటికే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటటీ నియామకం అయ్యింది. అయితే పొత్తులో భాగంగా జనసేనతో సమన్వయం కోసం టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులను ఎంపిక చేయనుంది. అటు జనసేన నుంచి ఐదుగురు సభ్యులు ఇటు టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులు మెుత్తం పదిమంది సభ్యులతో జేఏసీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆ ఐదుగురు ఎవరు అనేదానిపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్ కార్యచరణ, ఢిల్లీలో న్యాయనిపుణులతో చర్చలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో దర్యాప్తు పలు అంశాలపై చంద్రబాబు నాయుడుతో లోకేశ్ తోపాటు కుటుంబ సభ్యులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News