వెంటనే ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోండి.. పోలింగ్ అయ్యేవరకు వదలొద్దు: ఈసీ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో పోలింగ్ పర్సంటేజ్ కూడా గతం కంటే మెరుగ్గా ఉందని ఈసీ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. క్యూలో నిలబడి ఓటు వేయకుండా డైరెక్ట్‌గా బూత్‌లోకి వెళ్తోన్న తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్ ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసి చెంపపై కొట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఓటర్ కూడా ఎమ్మెల్యేను చెంపపై కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు సదరు వ్యక్తిపై దాడి చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే శివకుమార్‌పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Read More..