Kakinada: ఏసీబీకి చిక్కిన బందనపూడి వీఆర్వో
కాకినాడ జిల్లా కాజులూరు మండలం బందనపూడికి చెందిన వీఆర్వో పామర్తి సూర్య చంద్రరావు ఏసీబీకి చిక్కారు..
దిశ, (కాజులూరు): కాకినాడ జిల్లా కాజులూరు మండలం బందనపూడికి చెందిన వీఆర్వో పామర్తి సూర్య చంద్రరావు ఏసీబీకి చిక్కారు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన తలాటం వెంకటేష్ 30 సెంట్లు భూమికి పాస్ బుక్ కోసం దరఖాస్తు చేశారు. పాస్ బుక్ ఇవ్వడానికి వీఆర్వో సూర్య చంద్రరావు 6 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో తలాటం వెంకటేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో బందనపూడి సెంటర్‌లో వీఆర్వో సూర్య చంద్రరావుకు తలాటం వెంకటేష్ 6 వేలు రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో సూర్య చంద్రరావును కాజులూరు తహశీల్దార్ కార్యాలయం తరలించి విచారణ నిర్వహించారు.