Kakinada: సీఎం చంద్రబాబుకు యనమల సంచలన లేఖ
సీఎం చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు...
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సెజ్ వాస్తవ బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Former Minister Yanamala Ramakrishna) లేఖ రాశారు. గత ప్రభుత్వం హయాంలో కాకినాడ సెజ్(Kakinada Sez) కోసం తక్కువ ధరలకు రైతులు(Farmers), మత్య్సకారుల(Fishermen) నుంచి భూములు కొన్నారని, ఆ తర్వాత పలు కంపెనీలకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని లేఖలో ఆయన గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారంలో పేద బీసీ రైతులు, మత్య్సకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న రైతులు, మత్య్సకారులకు మాయ మాటలు చెప్పి భూములను కొనుగోలు చేసి పెద్ద కంపెనీలు లాభపడ్డాయని పేర్కొన్నారు. కేవీరావు తక్కువ ధరకు భూమి కొని జీఎంఆర్ గ్రూపు సంస్థలకు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. జగన్ బినామీ అయిన అరబిందోకు సుమారు రూ. 4 వేల కోట్లకు అమ్మారని వ్యాఖ్యానించారు. కాకినాడ పోర్టు ద్వారా దివీస్ కూడా లబ్ధి పొందిందని తెలిపారు. సెజ్ కోసం బీసీలు, మత్య్సకారులు రూ. 10 వేల ఎకరాలు కోల్పోయారని, వారికి తక్షణమే న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును యనమల కోరారు.