Breking: వైసీపీ అనేది ఉప్మా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పథకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు...

Update: 2023-06-21 14:14 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ పథకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్ముడివరంలో వారాహి యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్‌ విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల పేరుతో వందమంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అనేది ఉప్మా ప్రభుత్వమని పవన్ ఎద్దేవా చేవారు. 75 శాతం ప్రజలు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని పవన్ చెప్పారు.

రైతు రుణాలపై సున్నా వడ్డీలు ఇస్తున్నారని, 100 మంది రైతుల్లో 30 మందికి సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నారని పవన్ తెలిపారు. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్లే రైతులు నష్టపోయారని వ్యాఖ్యానించారు. పండించిన ధాన్యంలో ఓ బస్తా ఎమ్మెల్యే ద్వారంపూడికి వెళ్తోందని పవన్ ఆరోపించారు. రైతు కన్నీటిపై ద్వారంపూడి ఫ్యామిలీ లాభం పొందుతోందని ఆరోపించారు. ఒక జిల్లాకు పేరు పెట్టినప్పుడు రెండు అభిప్రాయాలు ఉంటాయని, రెండు అభిప్రాయాలు ఉంటే ప్రభుత్వం వినాలని సూచించారు.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అల్లర్లు జరిగాయని గుర్తుచేశారు. కులల మధ్య చిచ్చు పెట్టాలన్న ఆలోచన వల్లే కోనసీమలో అల్లర్లు జరిగాయని పవన్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

Nara Lokesh బలమైన ఆలోచనతో ఉన్నాం.. బాగు చేస్తాం..!  

వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న పవన్ కల్యాణ్.. షాక్ లో జనసేన కార్యకర్తలు!

Tags:    

Similar News