జగన్ ఏం చెబితే అది చేస్తా: వంగా గీత

ఏపీలో జరిగే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు..

Update: 2023-12-30 11:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను మార్చుతున్నారు. గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరిని ఎంపీకి బదులు ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు ఈ విషయాన్ని సీఎం జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. జగన్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆమె చెప్పారు. గెలుపోటములను బేరీజు వేసుకుని తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆమె స్పష్టం చేశారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఓకేనని చెప్పారు. ఎన్నికల సమయంలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయమని పార్టీ పరంగా తనకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. సీఎం జగన్ ఏం చేయమంటే అదే చేస్తానని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం మేరకు ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యేగా బరిలోకి దిగమన్నా తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

Tags:    

Similar News