Big Breaking: తిరుపతి జిల్లాలో భూకంపం
తిరుపతి జిల్లాలో భూకంపం కలకలం రేగింది...
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో భూకంపం కలకలం రేగింది. దొరవారి సత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకన్లపాటు భూమి కంపింది. దీంతో ఇళ్లలోని సామాన్లు కింద పడ్డాయి. కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో పాటు భారీ శబ్ధం కూడా వచ్చినట్లు చెబుతున్నారు. పలు చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వచ్చినట్లు తెలిపారు. గతంలోనూ పలుమార్లు తమ జిల్లాలో భూకంపం వచ్చిందని, ప్రతిసారి తామెంతో భయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు. అయితే భూకంపం తీవ్రత ఎంత అనేది తెలియాల్సి ఉంది.
అటు అధికారులు అప్రమత్తమయ్యారు. ఏయే ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎంతమేర నష్టం జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.