టీటీడీకి వ్యతిరేకంగా నిరసన
టీటీడీ ప్రైవేట్ వాహనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంను నిరసిస్తూ బుధవారం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రకాడాలతో డ్రైవర్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
దిశ, తిరుపతి: టీటీడీ ప్రైవేట్ వాహనాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంను నిరసిస్తూ బుధవారం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రకాడాలతో డ్రైవర్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలు పైబడిన వాహనాలను తిరుమలకి అనుమతించమన్న ప్రకటనతో డ్రైవర్ కార్మికులు రోడ్‌పైకి వచ్చి టీటీడీ అధికారుల తీరును ఎండ గట్టారు. తిరుమలపై ఆధారపడి సుమారు 45 వేల మంది డ్రైవర్ కార్మికులు పనిచేస్తున్నారని వెల్లదించారు. ఇలాంటి నిర్ణయంతో మా డ్రైవర్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భారీ ఉద్యమాలు చేపడతామని డ్రైవర్ కార్మికుల హెచ్చరించారు.
Also Read.
కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ పగ్గాలు.. ఇంచార్జిగా నియామకం