హెల్త్ బులిటెన్ విడుదల: విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం తారకరత్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని, ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తున్నాడని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. అయితే, అనూహ్యంగా సాయంత్రం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో అభిమానులు, టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.