ఈ రాజకీయాల్లో నేతలకు కష్టాలు శాశ్వతం కాదు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రేపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో జగన్‌ భేటీ అయ్యారు.

Update: 2024-10-10 08:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రేపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో జగన్‌ భేటీ అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చ వైసీపీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో జగన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని, మా నాన్న సీఎం అయినా కష్టాలు వచ్చాయని, తనపై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారని అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన తీరును గుర్తు చేశారు. అలాగే మంచి మంచి వైపు దేవుడు తప్పకుండా ఉంటాడని, మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడడం బాధాకరమని, మోపిదేవి విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, మండలి రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు..పదవిపోకుండా రాజ్యసభకు కూడా పంపామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రేపల్లేలో గణేష్‌కు వైసీపీ నాయకుల మద్దతు చాలా అవసరం ఉందని మాజీ సీఎం జగన్ తన పార్టీ కార్యకర్తలు నేతలతో చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News