మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమం.. హాజరైన మంత్రి సుచరిత

Update: 2022-02-02 06:33 GMT

దిశ, ఏపీ బ్యూరో : 'మియావాకి విధానం ద్వారా మూడేళ్లపాటు మనం చెట్లను సంరక్షించాలి. అనంతరం ఒక్క చక్కటి వృక్ష సంపదగా మారుతుంది. అటవిశాఖ అధికారుల ద్వారా భూసార పరీక్షల అనంతరం ఈ మియావాకి పద్ధతి ద్వారా చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం'అని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. 6వ పటాలంలో మియావాకి పద్ధతిలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్‌లో భాగం రాష్ట్రంలోని అన్ని పోలీస్ బెటాలియన్‌లలో మొక్కలు నాటే కార్యక్రమనికి శ్రీకారంచుట్టామని డీజీపీ తెలిపారు. మొత్తం ఎనిమిది బెటాలియన్‌లలోని 15.35 ఎకరాల్లో 19,774 చెట్ల నాటనున్నట్లు తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగిందని వెల్లడించారు.

Tags:    

Similar News