Karthika Somavaram: నదీ తీరాల్లో కార్తీక సోమవారం శోభ.. శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు.. పల్లె్ల్లో ఉన్న శివలయాల్లోనూ.. లయకారుడికి కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున కృష్ణా (Krishna River), గోదావరి (Godavari River) నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వదిలారు.
దిశ, వెబ్ డెస్క్: నేడు మూడవ కార్తీక సోమవారం (Karthika Somavaram).. శైవక్షేత్రాలు భక్తుల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు.. పల్లె్ల్లో ఉన్న శివలయాల్లోనూ.. లయకారుడికి కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున కృష్ణా (Krishna River), గోదావరి (Godavari River) నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వదిలారు. శ్రీశైలం (Srisailam), విజయవాడ (Vijayawada), రాజమండ్రి, వేములవాడ (Vemulawada Rajanna), భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకుని తరించారు. ముఖ్యంగా విజయవాడలోని కృష్ణాతీరానికి, రాజమండ్రిలో గోదావరి తీరానికి భక్తులు భారీగా తరలివచ్చి.. పూజలు చేశారు.