Pawan Kalyan: వైఎస్ షర్మిలకు అండగా డిప్యూటీ సీఎం.. ఆస్తుల వివాదంలో సంచలన హామీ

ఆస్తుల వివాదంలో వైఎస్ షర్మిలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన హామీ ఇచ్చారు..

Update: 2024-11-01 13:11 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Former CM YS Rajasekhar Reddy) ఆస్తుల విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల(YS Sharmila)కు వాటా విషయంలో వైఎస్ జగన్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు రాజకీయంగా కూడా దుమారం రేగింది. జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్(YCP, Congress) నేతలు సైతం పరస్పరం విమర్శలు చోటు చేసుకుంటున్నారు. ఇక వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సైతం చేస్తున్నారు. అన్న ఆస్తుల కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అండగా ఉంటామంటూ షర్మిల విషయంలో ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిలకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) స్పందించారు. షర్మిలకు అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత తమదని తెలిపారు. ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటున్నారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. షర్మిల.... తమపై రాజకీయ విమర్శలు చేసినా ఆమెకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 


👉Also Read: TDP: విజయమ్మ హత్యకు కుట్ర ?.. టీడీపీ సంచలన ఆరోపణలు 


Similar News