Cyclone Michoung : ఏపీకి బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్..!

బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాన్ ఏపీకి దూసుకొస్తుంది. ఇవాళ నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ మధ్యాహ్నంలోపు తీరం దాటనున్నది.

Update: 2023-12-05 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాన్ ఏపీకి దూసుకొస్తుంది. ఇవాళ నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ మధ్యాహ్నంలోపు తీరం దాటనున్నది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సహయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించడంతో పాటు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Tags:    

Similar News