ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు: సీబీఐకు హైకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-12-27 06:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు జరిపిన దర్యాఫ్తు వివరాలను అందజేయాలని సీబీఐను ఆదేశించింది. ఆయేషా హత్య జరిగి ఏళ్లు దాటుతున్నా దర్యాప్తులో ఏమాత్రం పురోగతి లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాసాలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. ఇదిలా ఉంటే 2007 డిసెంబర్ 27 న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో బీ ఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News