‘గణేష్ విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు’..హోం మంత్రి పై విమర్శలు

దేశవ్యాప్తంగా ఈ రోజు(శనివారం) గణేషుని ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది.

Update: 2024-09-07 07:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా  ఈ రోజు(శనివారం) గణేషుని ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచే మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో భక్తులకు గణేష్ మండపాల ఎలాంటి వాతావరణం ఉండాలనే దానిపై కూడా సూచనలు చేశారు. అసలు విషయంలోకి వెళితే..గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది. అయితే మైక్ పర్మిషన్‌కు, విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతోంది. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలి అని ఆమె చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News