Tirupati: ఆగని బాంబు బెదిరింపులు.. ఈసారి ఏకంగా ఆలయానికే..

తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగట్లేదు. వరుసగా మూడోరోజు జాఫర్ సాధిక్ పేరుతో బెదిరింపు మెయిల్స్ రాగా.. ఈసారి ఒక ఆలయాన్ని కూడా పేల్చివేస్తున్నట్లు హెచ్చరించారు.

Update: 2024-10-27 06:43 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం నుంచి మొదలైన బాంబు బెదిరింపులు.. ఇప్పటికీ ఆగలేదు. మూడురోజులుగా నగరంలోని ప్రధాన హోటల్స్ కు ఐఎస్ఐ ఉగ్రవాదుల (ISI Terrorists) పేరిట బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) లు రంగంలోకి దిగి.. విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆదివారం కూడా మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb Threatening Mails) పంపారు. జాఫర్ సాధిక్ పేరుతో.. ఈసారి హోటళ్లతో పాటు ఆలయాలకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కేటీ రోడ్డులో ఉన్న ఆలయాల్లో బాంబులు పెట్టినట్లు ఉగ్రవాదులు మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటళ్లు, ఆలయాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. ఏ క్షణాన ఎక్కడ బాంబు పేలుతుందోనని పట్టణవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Tags:    

Similar News