CPI Narayana: బుడమేరు వరదలకు కారణం కొల్లేరు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో గత నెలలో సంభవించిన బుడమేరు వరదలకు కారణం కొల్లేరు ఆక్రమణలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-26 06:42 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో గత నెలలో సంభవించిన బుడమేరు వరదలకు (Budameru Floods) కారణం కొల్లేరు (Kolleru Lake) ఆక్రమణలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొల్లేరు ఆక్రమణలపై తాము పోరాడి.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేయగా.. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. కొల్లేరు సరస్సు ఆక్రమణలపై నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్న లవ్ అగర్వాల్ ఫిష్ మాఫియా టార్గెట్ చేసిందన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగకుండా తామే అండగా నిలిచామన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ లవ్ అగర్వాల్ ఏపీ భవన్ (AP Bhavan) రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారని సీపీఐ నారాయణ (CPI Narayana) తెలిపారు.

ఇప్పుడు కూడా కొల్లేరు చుట్టూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. కొల్లేరు తడి భూములు, పక్షుల అభయారణ్యం ఆక్రమణలకు గురవుతున్నాయని వాపోయారు. కొల్లేరు పరిరక్షణపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ధిక్కరణ నోటీసులు జారీ చేసిందన్న ఆయన.. ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy cm Pawan kalyan)లకు లేఖ రాశారు. వెంటనే కొల్లేరులో చేపల చెరువుల్ని ఆలస్యం చేయకుండా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. 100 చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న కొల్లేరు సరస్సు ఇప్పుడు 20-25 ఎకరాలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. పర్యావరణం గురించి ఎక్కువగా మాట్లాడే పవన్ కల్యాణ్ కు కొల్లేరు సరస్సును కాపాడే మంచి అవకాశం వచ్చిందని, కొల్లేరు పరిరక్షణపై దృష్టి పెట్టాలని సీపీఐ నారాయణ కోరారు. 

Tags:    

Similar News