డ్రగ్స్ దిగుమతి దారు ఆపార్టీ వాడే.. తీగ లాగితే డొంక కదిలిందిగా ..
కోడికూతతో మేలుకోవాల్సిన వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ పట్టుబడింది అనే వార్తతో ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కోడికూతతో మేలుకోవాల్సిన వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ పట్టుబడింది అనే వార్తతో ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు వైజాగ్ లో సంధ్య ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన డ్రగ్స్ కంటైనర్ ను సీబీఐ పట్టుకుంది. కాగా 50 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను కంటైనర్ లో తరలిస్తుండగా సీబీఐ గుర్తించింది.
అనంతరం 50 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కంటైనర్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అయితే డ్రగ్స్ మాఫియా పై సీబీఐ ద్రుష్టి సారిస్తే.. స్థానిక ప్రజలు కూడా తామేమన్నా తక్కువా అన్నట్టు..డ్రగ్స్ దిగుమతి దారుడి పై ద్రుష్టి సారిస్తున్నారు. అసలు డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తి ఏ కులస్తుడు, ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి అని ఆరా తీస్తూ నెట్ లో సెర్చ్ చేశారు.
ఇంకేముంది. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు.. కరోనా టైమ్ లో సంధ్య ఆక్వా అధిపతి కూనం వీరభద్రరావు ముఖ్యమంత్రి సహాయ నిధి కి 50లక్షల చెక్ ఇచ్చాడు. అలానే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు వీరభద్రరావు ఫోటోతో పత్రిక లో ఇచ్చిన యాడ్ కూడా బయటపడింది.
దీనితో సంధ్య ఎక్స్పోర్ట్స్ కి జగన్ ప్రభుత్వానికి లింక్ ఉన్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక గతంలో గుజరాత్ ముంద్రపోర్ట్లో 25 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే వాటి లింకులు విజయవాడలో తేలాయి. మరి ఇప్పుడు విశాఖ తీరని స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లింకులు తాడేపల్లిలో తేలుతాయేమో..? చూడాలి అంటున్నారు సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లు చూసిన నెటిజన్స్.