AP ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రఘువీరా జోస్యం
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నకలు గతంలో ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా జరిగాయి. సినిమాలను మించి పోలింగ్ సమయాల్లో, పోలింగ్ అనంతరం కేంద్రాల్లలో గొడవలు జరిగాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా జరిగాయి. సినిమాలను మించి పోలింగ్ సమయాల్లో, పోలింగ్ అనంతరం కేంద్రాల్లో గొడవలు జరిగాయి. ప్రధాన పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ, ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. మరో ఆరు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అన్నారు. కచ్చితంగా పలానా పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధికార వైసీపీ లేదా? ఎన్డీఏ కూటమి ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం చాలా ఉందని అన్నారు. కాంగ్రెస్ డబ్బు, మద్యం ప్రభావం లేని నాలుగైదు చోట్లా విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు.