AP Politics:హంతకులకు బుద్ధి చెప్పేందుకే ఎన్నికల్లో పోటీ:వైఎస్ షర్మిల
ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో తనని దేవుడు ధర్మం వైపు నిలబడమని శాసించాడని, అందుకే తాను పోటీ చేస్తున్నానని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.
దిశ,బద్వేలు: ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో తనని దేవుడు ధర్మం వైపు నిలబడమని శాసించాడని, అందుకే తాను పోటీ చేస్తున్నానని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం బద్వేలు నియోజకవర్గంలో కాశి నాయన, కలసపడు, పోరుమామిళ్ళ, బద్వేలు తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డినీ సీబీఐ అరెస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడ్డారని ఆమె ఆరోపించారు. ఈ హత్య కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదని నేను పోటీ చేస్తున్నా అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఏనాడు పార్లమెంట్ లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి కానీ, సమస్యల గురించి కానీ ప్రస్తావించలేదని విమర్శించారు.
Read More..
AP Politics:కార్మికలోకం పొట్ట కొట్టిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన: జీవీ ఆంజనేయులు