అగ్నిమాపక సేవల శాఖకు రెస్క్యూ బోట్లు, ఓబీఎం అందజేత

రెండు రెస్క్యూ బోట్లు, ఒక ఓబిఎం జిల్లా అగ్నిమాపక సేవల శాఖకు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అందజేశారు.

Update: 2023-02-14 11:04 GMT

దిశ, ఏలూరు : ప్రకృతి విపత్తుల సమయంలో మెరుగైన సేవలు అందించేందుకు రూ 12 లక్షలు విలువైన రెండు రెస్క్యూ బోట్లు, ఒక ఓబిఎం ను జిల్లా అగ్నిమాపక సేవల శాఖకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అందజేశారు. స్థానిక ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ అమరావతి బోటింగ్ క్లబ్ నుంచి రప్పించిన రెండు రెస్క్యూ బోట్లను ,ఒక ఓబిఎం ను జిల్లా అగ్నిమాపక అధికారి డి. మాల్యాద్రికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి డి .మాల్యాద్రి మాట్లాడుతూ విపత్తుల సమయంలో మెరుగైన సేవలు అందించేందుకు రెస్క్యూ బోట్లు అందించిన జిల్లా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో ఎటువంటి విపత్తుల జరిగిన అనగా కాలువలు, బావుల యందు ఎటువంటి ప్రమాదం జరిగిన ప్రజలు తక్షణమే స్పందించి హెల్ప్ లైన్ నెంబర్ 101 కు ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే తమ శాఖ తక్షణమే స్పందించి విపత్తుల నుండి రక్షించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి వి.రామకృష్ణ లీడింగ్ ఫైర్ మెన్ రవికుమార్, డ్రైవర్ ఆపరేటర్లు ఎం .రామకృష్ణ రాజు, కె. రఘువర్మ, ఫైర్ మెన్లు పి. ప్రశాంత్, జి. ఏసుబాబు ,ఎం .ఎం.సత్యనారాయణ, ఎం ఎస్ వి ప్రసాద్ ,డి .శ్రీనివాస్, ఎస్ కె అబ్దుల్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News