CM Chandrababu Nayudu :త్వరలో కో- ఆపరేటివ్ ఎన్నికలు : సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2024-11-27 13:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రంలో కో-ఆపరేటివ్(Co-operative Elections), నీటి పారుదల ఎన్నికలు జరగనున్నాయని.. వాటిలో కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు రూ.1400 కోట్లు మంజూరు చేశామని, సంక్రాంతి నాటికి రోడ్ల మీద ఒక్క గుంత కూడా లేకుండా చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని, కార్యకర్తలను ఆదుకునేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.  

Tags:    

Similar News