వరద బాధితులకు చిన్నారుల విరాళం.. వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భారీ వరదలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

Update: 2024-09-09 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భారీ వరదలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి మద్దతుగా ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రు లోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన ఈ చిన్నారులు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు నాయుడు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ఈ వీడియో నిజంగా నా రోజుగా మార్చేసింది. విద్యార్థులు తమ పాకెట్ మనీని వరద బాధితులకు ఇవ్వడం ద్వారా అసాధారణ కరుణను ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం యొక్క ప్రాముఖ్యతను వారికి బోధించడం కోసం పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి సంజ్ఞలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి, దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని భవిష్యత్తును వాగ్దానం చేస్తాయి" అని సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

Nara Chandrababu Naidu tweet : https://x.com/ncbn/status/1833090947632005346


Similar News