ముగిసిన సీఎం జగన్ కడప పర్యటన..

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా మూడు రోజులపర్యటన ముగిసింది. ఈనెల 1 నుంచి వైఎస్ జగన్ కడపలోనే ఉన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు..Latest Telugu News

Update: 2022-09-03 07:24 GMT

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా మూడు రోజులపర్యటన ముగిసింది. ఈనెల 1 నుంచి వైఎస్ జగన్ కడపలోనే ఉన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయం వద్ద సీఎం వైఎస్ జగన్‌కు కలెక్టర్ విజయ రామరాజు, ఎస్పీ అన్బురాజన్, ఇన్ చార్జి మంత్రి ఆది మూలం సురేశ్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జన రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ ఒకటిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకున్నారు. సొంత నియోజకవర్గంలోని వేముల మండలం వేల్పుల‌లో పలు అభివృద్ధి భవనాలను ప్రారంభించారు.

మరుసటి రోజు సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, భార్య వైఎస్ భారతీతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం పులివెందల, వేంపల్లి , చక్రాయపేట మండలాల్లోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని స్థానిక నేతలకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్న బాబు, జగన్.. వారిపై మళ్లీ ఫోకస్

Tags:    

Similar News