Ys Jagan: పెన్షన్‌దారులకు శుభవార్త.. Cabinet Meetలో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు తీపి కబురు అందించింది. పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ..

Update: 2022-12-13 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు తీపి కబురు అందించింది. పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయం మెుదటి బ్లాక్‌ సమావేశమందిరంలో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 62.31 లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది.

ప్రస్తుతం పెన్షన్ రూ.2,500 ఇస్తున్నారు. అయితే మరో రూ.250 ఇచ్చేందుకు నిర్ణయించారు. జనవరి నుంచి రూ.2,750 పెన్షన్‌ను లబ్ధిదారులకు అందజేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రూ.8800 కోట్ల పెట్టుబడితే జేఎస్‌డబ్యూ స్టీల్‌ ప్లాంట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఏపీ జుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెల్త్ హబ్స్ ఏర్పాటులో కొత్త విధానాన్ని తీసుకున్నారు. ఇందుకు కూడా ఆమోదం తెలిపారు. ఏపీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి, భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణను ఆమోదించారు.

అలాగే బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 1301.68చ.కీమీ. పరిధితో బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు వైఎస్ఆర్ పశు భీమా పథకం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనలకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

సంక్షేమాన్ని మింగేస్తున్న కేంద్రం.. అయినా సైలెంట్!  


Similar News